<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   దేవా నీ దివ్య వాక్యము
   ఈవిగ మాకు దొరికెను(2)
   హల్లెలూయ హల్లెలూయ(2)

[V1]
 పాపముతో నిండిన మమ్మున్ - దీపము వంటి వాక్యమే
 కల్వరికి నడిపించి - కలుషములను తొలగించి (2)
 మా హృదయము వెలిగించెను, ఆ....

[V2]
 పాల వంటి వాక్యము - తేనె కంటె మధురము
 వెండి బంగారముల వెల ఎంత అయినను(2)
 తుల తూగవు నీ వాక్యముతో ఆ....

[V3]
 నీ వాక్యము నీరై యుండెన్ - మా దాహము తీర్చుచుండెను
 ఆ నీరే మాకు - పానము స్నానమును(2)
 నీ వాక్యము మా కీయుమా ఆ....

[V4]
 నిర్మల క్షీరము వంటిది - నిత్యానందము వంటిది
 నీ పాలలో మముపెంచి - నీ తోటలో మము ఉంచి (2)
 నీ బలమును మా కీయుమా ఆ....

[V5]
 సుత్తెయిన మెత్తన జేయున్ - విత్తనమై ఫలియించును
 ఖడ్గమువలె దూయుచు కలుషములను కోయుచు(2)
 నీ మహిమ మా కీయుమా ఆ....

[V6]
 అద్దమువలె దిద్దుకును మమ్మున్ - అగ్నియై కాల్చుకును చెత్తన్
 నీ వాక్యము వివరించి మాలోటుకును సవరించి (2)
 నీ రూపము మా కీయుమా ఆ....

[V7]
 వాక్యముతో నింపితివి - సాక్ష్యులుగా పంపితివి
 నీ చేతిలో మము దాచి - నీ చూపులో మము కాచి (2)
 నీ సన్నిధి మా కీయుమా ఆ....</lyrics>
<title>దేవా నీ దివ్య వాక్యము</title>
<hymn_number>121</hymn_number>
</song>